OSCAR: వందేళ్ల నిరీక్షణకు ఆస్కార్ తెర

ఆస్కార్ అకాడమీ కీలక నిర్ణయం.. స్టంట్‌ డిజైన్‌ పేరుతో కొత్త కేటగిరి;

Update: 2025-04-12 05:30 GMT

సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల జాబితాలో 'స్టంట్‌ డిజైన్‌' కేటగిరిని చేర్చారు. 2027 నుంచి విడుదల కానున్న సినిమాల నుంచి ఈ కొత్త విభాగానికి సంబంధించిన అవార్డులు అందజేయనున్నట్లు అకాడమీ ప్రకటించింది. ఈ కొత్త కేటగిరీకి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను ఆస్కార్‌ విడుదల చేసింది. ఇందులో హాలీవుడ్‌ సినిమాల సరసన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇమేజ్‌ను చేర్చారు. ఆస్కార్ అవార్డుల జాబితాలో 'స్టంట్‌ డిజైన్‌' కేటగిరి చేరుస్తూ ఆస్కార్ అకాడమీ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో హాలీవుడ్‌ సినిమాల సరసన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇమేజ్‌ను చేర్చటంతో ఇది భారతీయ సినిమాకు దక్కిన గౌరవమంటూ తెలుగు ఆడియన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్టంట్‌ డిజైన్‌ పోస్టర్‌లో ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ సినిమాల్లోని ఇమేజ్‌లతో రూపొందించారు.

2028 నుంచి అవార్డుల ప్రదానోత్సవం

సోషల్ మీడియాలో ఆస్కార్ అకాడమీ పోస్టర్ రీలిజ్ చేస్తూ ట్వీట్ చేశారు. 2028లో జరగనున్న 100వ అకాడమీ అవార్డుల వేడుకలో ఈ జాబితాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. సినిమా ప్రారంభం నుంచి చిత్ర నిర్మాణంలో భాగంగా ఉన్న 'స్టంట్ డిజైన్' ఉందని..కళాకారులను ఆస్కార్ కేటగిరీలో భాగం చేయడం గర్వంగా ఉందన్నారు.

స్పందించిన రాజమౌళి

ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్' మూవీలో 'నాటు నాటు' పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. తాజాగా స్టంట్ డిజైన్ కొత్త పోస్టర్‌లో 'ఆర్ఆర్ఆర్' ఫొటో భాగం కావటంపై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు. వందేళ్ల నిరీక్షణ తర్వాత 2027లో విడుదలయ్యే చిత్రాలకు ఆస్కార్ డిజైన్ కేటగిరీని చేర్చటం సంతోషంగా ఉందన్నారు. డేవిడ్ లీచ్, క్రిస్ ఓ హారా, స్టంట్ కమ్యూనిటీకి, అకాడమీ సీఈఓ బిల్ క్రామెర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ యాక్షన్ విజువల్స్ చూసి సంతోషించినట్టు తెలిపారు. ఆస్కార్ లో కొత్త విభాగాలను కూడా చేర్చడంతో ప్రతిభావంతులకు సరైన గుర్తింపు లభిస్తుందని జక్కన్న వెల్లడించాడు. ఈ విభాగాల్లో ఎంట్రీలు తీసుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించాడు.


Similar News