రివ్యూ : అఖండ 2 : తాండవం
తారాగణం : నందమూరి బాలకృష్ణ, సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ, సర్వదమన్ బెనర్జీ, శాశ్వత చటర్జీ, రోషణ్ విన్సెంట్, పూర్ణ తదితరులు
ఎడిటర్ : తమ్మిరాజు
సంగీతం : థమన్ ఎస్
సినిమాటోగ్రఫీ : సి రామ్ ప్రసాద్, సంతోష్
నిర్మాతలు : రామ్ ఆచంట, గోపి ఆచంట
దర్శకత్వం : బోయపాపి శ్రీను
అఖండ 2.. ఈ చిత్రానికి అఖండకు సీక్వెల్ గా వస్తుందని చాలామంది అలెర్ట్ అయిపోయారు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని భావించారు. అలాగే సీక్వెల్ లో ఎలాంటి కథతో ఆకట్టుకుంటాడా బాలయ్య అని ఎదురుచూశారు. ఇక ఈ నెల 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఒక వారం తర్వాత విడుదలైంది. మొత్తంగా ఈ మూవీ ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుందా అనేది చూద్దాం.
కథ :
అఖండకు ముగిసిపోయిన కథ నుంచి మొదలు పెట్టారు ఈ మూవీని. ఆ కథలో భాగంగా జనని(హర్షాలి) చిన్నతనంలోనే ఓ పెద్ద సైంటిస్ట్ అవుతుంది. దానికంటే ముందే అఖండ(బాలకృష్ణ) చాలా యేళ్లుగా ఘోరమైన తపస్సు మొదలు పెడతాడు. మరోవైపు ఈ దేశాన్ని నాశనం చేయడానికి చైనాకు చెందిన ఒక జనరల్ కూడా ప్రయత్నం చేస్తుంటాడు. అతనికి ఇండియాలో ప్రయత్నం కూడా చేసే ఒక విపక్ష ఎమ్.పి కూడా తోడవుతాడు. వీరంతా మహాకుంభమేళాలో కొంత వైరస్ మందును కలుపుతారు. దీంతో కుంభమేళాకు వచ్చిన వాళ్లంతా అనారోగ్యం పాలవుతారు. పైగా ఇదంతా హిందూ మతం మీద కోపంతోనే చేస్తున్నారు అని తెలుసుకుంటారు. మరోవైపు బాలమురళి కృష్ణ (బాలకృష్ణ) రాయలసీమలో ఓ ఎమ్మెల్యేగా గెలిచి ఉంటాడు. అతని తల్లి అఖండ కోసం బెంగ పెట్టుకుంటుంది. మొత్తంగా ఆ వైరస్ కు మందును కనిపెట్టారు అనుకున్న టైమ్ లో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఇందులో భాగంగా జనని ఆ మందుకోసం తెస్తున్న టైమ్ లో అఖండ ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాతేమవుతుంది అనేది మిగతా కథ.
ఎలా ఉంది :
నందమూరి బాలకృష్ణ మూవీ అంటే ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే టాక్ వచ్చేసింది. వరుసగా సూపర్ హిట్స్ కొడుతున్నాడు. దానికి హిట్ మూవీకి సీక్వెల్ గా అంటేనే ఇంక చెప్పేదేముందీ. అఖండ 2 లో అన్ని అంశాలు కనిపించాయి. యాక్షన్, సెంటిమెంట్, దేశభక్తి, సనాతన ధర్మ రక్షణ ఇవన్నీ పొందు పరిచారు. ముఖ్యంగా అఖండ ఎంట్రీ అయిన తర్వాత సినిమా నెక్ట్స్ లెవల్ లో కనిపిస్తుంది. అతని ఎంట్రీ తర్వాత ప్రతి సీన్ ను కూడా మరో స్థాయిలో కనిపిస్తుంది. ముఖ్యంగా సనాతన ధర్మానికి సంబంధించిన సీన్స్ అద్బుతంగా వర్కవుట్ అయ్యాయి.
బాలమురళీ కృష్ణ పాత్రలో మరీ హైలెట్ లేకుండా చూసుకున్నాడు ఈ సారి. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో అతని ఫైట్ సీన్ తో పాటు అన్ని భాషలకు సంబంధించిన డైలాగ్స్ తో అదరగొట్టాడు. మోదీని పోలిన పాత్రతో కనిపిస్తుంది ప్రధానమంత్రిగా. అతని సీన్స్ పెద్దగా హైలెట్ అయ్యేవి కనిపించవు. బట్ ధర్మ రక్షణ కోసం అనేది మాత్రం ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. విలనీ బలహీనంగా కనిపించడం మాత్రం ఒక మైనస్ గా కనిపిస్తుంది. పైగా ఆ విలన్స్ ఒకే చోట సెట్ చేసినట్టుగా కనిపిస్తారు. ఇక బాలయ్య నట విశ్వరూపం మాత్రం సెకండ్ హాఫ్ లో కనిపిస్తుంది. ప్రతి సీన్ లోనూ అదరగొట్టాడు. కాకపోతే ఎక్కువ యాక్షన్ సీన్స్ కనిపిస్తాయి. అయితే ఫైట్స్ అంత గొప్పగా లేకపోవడం మాత్రం కనిపిస్తుంది.
టెక్నికల్ గా మాత్రం అదరగొట్టారు. థమన్ మ్యూజిక్ మరోసారి అదిరిపోయింది. అతని నేపథ్య సంగీతం మాత్రం హైలెట్ గా కనిపిస్తోంది. సినిమాటోగ్రఫీ బావుంది. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ బావున్నాయి. ఎడిటింగా ఆకట్టుకుంది. డైలాగ్స్ మాత్రం అద్భుతం అనిపిస్తుంది. కాకపోతే హిందూ ధర్మానికి సంబంధించిన డైలాగ్స్ కాస్త ఎక్కువగా కనిపిస్తాయి. అయినా అవి కూడా ఇప్పుడు అవసరం అన్నట్టుగా కనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకత్వ పరంగా కొన్ని కొన్ని మైనస్ లు కనిపిస్తాయి కానీ బోయపాటి స్టైల్ మాత్రం ఇక్కడ మాగ్జిమం వర్కవుట్ అవుతుంది.
నటన పరంగా బాలయ్య డ్యూయొల్ రోల్ లో అదరగొట్టాడు. తనకు తానే సాటి అనిపించుకున్నాడు. సంయుక్త పాత్ర చిన్నదే కానీ ఆకట్టుకుంది. హర్షాలీ పాత్రలో నటన ఇంకాస్త బావుండు అనిపిస్తుంది. ఆది పినిశెట్టి విలనీ మాత్రం పెద్దగా ఇంపాక్ట్ చూపించదు. కానీ అతని గెటప్ మాత్రం బావుంది. సర్వదమన్ బెనర్జీ, పూర్ణ, కల్కితో ఆకట్టుకున్న శాశ్వత చటర్జీ, చైనా జన్రల్ గా సంగయ్ షెల్ట్రీం బాగా చేశారు. మిగతా పాత్రలన్నీ ఆకట్టుకునేలానే ఉన్నాయి.
ఫైనల్ గా : అఖండ 2 .. బాలయ్య నట విశ్వరూపం
రేటింగ్ : 3/5
బాబురావు. కామళ్ల