విడుదల తేదీ : డిసెంబర్ 25, 2025
నటీనటులు : రోషన్ మేక, అనస్వర రాజన్, నందమూరి కల్యాణ్ చక్రవర్తి, అర్చన తదితరులు.
దర్శకుడు : ప్రదీప్ అద్వైతం
నిర్మాణం : ప్రియాంక దత్, జి.కె. మోహన్, జెమిని కిరణ్
సంగీత దర్శకుడు : మిక్కీ జె. మేయర్
సినిమాటోగ్రాఫర్ : ఆర్ మధీ
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
స్టార్ వారసుల లిస్ట్ లో ఉన్న రోషన్ ఛాంపియన్ గా మారడానికి బాక్స్ ఆఫీస్ రేస్ లో కి వచ్చేసాడు.
రోషన్,స్వప్న సినిమా, మిక్కీ మే జేయర్ అనశ్వర రాజన్ ఛాంపియన్ కి భారీ తనం తెచ్చాయి.
ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ ఛాంపియన్ ఏలా ఉన్నాడో చూద్దాం
కథ :
కథ నేపథ్యం స్వాతంత్ర రాక ముందు హైదరాబాద్ కాలం నాటిది. ఒక కేఫ్ లో పని చేస్తూ, తన ఫుట్ బాల్ గేమ్ లో ఛాంపియన్ అయి దేశం విడిచి పోవాలని కలలు కనే మైఖేల్ (రోషన్) కథ ఒక వైపు..
రజాకార్ల కు ఎదురు తిరిగి తమ స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్న భైరన్ పల్లి కథ మరొక వైపు...
లండన్ వెళ్లి ఫుట్ బాల్ గేమ్ లో రాణించాలని
మైఖేల్ కలలు కంటుంటాడు. తన ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లండన్ వెళ్లేందుకు అడ్డు వస్తుంది. దీంతో ఎలాగైనా లండన్ వెళ్లాలానే మైఖేల్ ఆశ ఆయుధాలను అక్రమంగా రవాణా చేసే పనికి ఒప్పిస్తుంది. ఆపనిలో అనుకోని పరిస్థితి లు కారణం గా భైరాన్ పల్లి వెళతాడు మైఖేల్. అక్కడ ఒక 15 రోజులు ఉండాల్సి వస్తుంది. తను రవాణా చేస్తున్న ఆయుధాలు కాపాడేందుకు అక్కడ ఉంటాడు.
లండన్ వెళ్లాలానే తన కల భైరన్ పల్లి లో కొత్త మలుపు తీసుకుంటుంది. అక్కడ పరిచయం అయిన చంద్రకళ ( అనశ్వర రాజన్) తన మనసుకు దగ్గర అవుతుంది. ఆ ఊరి పై జరుగుతున్న దాడులు కు ఎదురు తిరిగి తన దగ్గర ఉన్న ఆయుధాలను వాళ్ళ పోరాటానికి అందిస్తాడు. అక్కడ నుండి తన లక్ష్యం మారుతుంది. తనది కాని పోరాటం మైఖేల్
జీవితాన్ని ఏలా మారుస్తుంది...? ఒక క్రీడాకారుడు ఏలా ఉద్యమం లో ఛాంపియన్ అవుతాడు అనేది
మిగిలిన కథ..? రజాకార్ల దాడులకు ఎదురు నిలిచి పోరాడిన భైరన్ పల్లి కి మైఖేల్ చివరికి ఏమి సాధించాడు అనేది మిగిలిన కథ..
కథనం:
హైదరాబాద్ భారత దేశం లో విలీనం కు నిజాం ప్రభుత్వం సహకరించని పరిస్థితులు..
రజాకార్ల అరాచలకు ఎదురు తిరిగిన భైరాన్ పల్లి పై దాడులు జరుతున్న కాలం..చరిత్ర లో రక్తం తో రాసిన ఇలాంటి సంఘటన లను చాలా ఎమోషనల్ గా తెర కె క్కించాడు దర్శకుడు ప్రదీప్. ఒక చరిత్ర లో తాను రాసుకున్న మైఖేల్ కథ చాలా బాగా ఇమిడి పోయింది. ఒక స్టార్ యాక్టర్ ని రోషన్ లో కనిపించాడు. ఎమోషన్ కి అనువుగా మారే తన బాడీ లాంగ్వేజ్ లో చాలా పరిణితి కనిపించింది. తన స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టు కుంది. డాన్స్ లు, ఫైట్స్ లో ఒక స్టార్ మెటీరియల్ గా అనిపించాడు. చాలా అలవోకగా తన పాత్ర కు ప్రాణం పొసాడు. భైరాన్ పల్లి కి ఉన్న చరిత్ర ను దర్శకుడు ప్రదీప్ తెరమీద కు చాలా సహజం గా తీసుకొచ్చాడు. అనశ్వర రాజన్ పాత్ర కథ లో చాలా రిలీఫ్ మూమెంట్స్ ని క్రి యే ట్ చేసింది. రోషన్, అనశ్వర రాజన్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.. గిర గిర.. పాట ఒక సెలెబ్రేషన్ మూమెంట్. ఆ ప్రేమ కథ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే అవకాశం తీసుకోలేదు దర్శకుడు. భైరాన్ పల్లి నేపథ్యంలో పాత్ర లను చాలా ప్రభావ వంతం గా మాలిచాడు దర్శకుడు. రచ్చ రవి, అభయ్, కళ్యాణ్ చక్రవర్తి, అర్చన పాత్రలు గుర్తుండి పోతాయి.
లగాన్ వంటి కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు ప్రదీప్. పోరాట సన్ని వేశాలను చాలా బాగా డీల్ చేసాడు దర్శకుడు. హీరో తన లక్ష్యం ఏంటో తెలుసుకోవడానికి తన తండ్రి పాత్ర తో దర్శకుడు తీసుకొచ్చిన ఎమోషనల్ సీన్ చాలా బాగుంది. చాలా లేయర్స్ లో కథ ను చెప్పడం తో ప్రేక్షకుడు ఎవర్ని అనుసరించాలో అనే డైలామా కలుగుతుంది. భైరన్ పల్లి కొన్నిసార్లు మైఖేల్ కథ ను డామినేట్ చేసింది. కళ్యాణ్ చక్రవర్తి తన పాత్ర లోని ఎమోషన్స్ ని కొన్ని సార్లు అర్ధం చేసుకోలేదనిపించింది. అనశ్వర రాజన్ కథ లో రిలీఫ్ పాయింట్. తన స్క్రీన్ ప్రజన్స్ బాగుంది.
కథ ను చాలా ఎమోషనల్ పాయింట్స్ తో దర్శకుడు ప్రయాణం సాగించాడు. మొత్తానికి ప్రదీప్ అద్వైతం దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. ఇక సంగీత దర్శకుడు సమకూర్చిన పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. . ఈ చిత్ర నిర్మాతలు ప్రియాంక దత్, జి.కె. మోహన్, జెమిని కిరణ్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరి గా:
ఒక చరిత్ర క నేపథ్యంలో దర్శకుడు ప్రదీప్ రాసుకున్న
మైఖేల్ కథ బాగుంది. రోషన్ ఒక స్టార్ మెటీరియల్ అని నిరూపించు కున్నాడు. ఎమోషనల్ వార్ డ్రామా లో ఒక ప్రేమ కథ ను నేర్పు గా అల్లుకున్నాడు దర్శకుడు. నిర్మాణ విలువలు, బాగున్నాయి. థియేటర్ నుండి ప్రేక్షకుడు చాలా సంతృప్తి గా బయటకు వస్తాడు. అకట్టు కున్న వార్ డ్రామా..
రేటింగ్ : 3. 5/5