Special Trains : ఈ నెల 28 నుంచి వేసవిలో100 ప్రత్యేక రైళ్లు

Update: 2024-04-24 07:15 GMT

వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. ఈ నెల 28 నుంచి జులై 30 వరకు 100 స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు చెప్పారు. విశాఖపట్నం- చెన్నై, తాంబరం-బరౌనీ, ఎరోడ్- ధన్బాద్, సత్రగాచి- బెంగళూరు, తాంబరం- ధన్బాద్, ముజఫాపూర్- సికింద్రాబాద్, మహబూబ్నగర్-గోరఖ్పూర్ తదితర స్టేషన్ల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు.

సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వేసవి వేళ రద్దీని దృష్టిలో పెట్టుకుని సమర్ స్పెషల్ ట్రైన్లను పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్, ఉదయ్ పూర్ ఏప్రిల్ 30 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం, హైదరాబాద్, కటక్ మే 7 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం సేవలు అందిస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

వేసవి రద్దీ, ఇబ్బందుల కారణంగా డివిజన్‌ పరిధిలో గల ఆయా స్టేషన్‌లలో మంచినీటి సదుపాయాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ సౌరబ్‌ ప్రసాద్‌ ఆదేశించారు.

Tags:    

Similar News