దేశవ్యాప్తంగా లోక్‌సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. 359 మంది ఐదో తరగతి వరకు, 647 మంది 8వ తరగతి వరకు, 1303 మంది 12వ తరగతి, 1502 మంది అభ్యర్థులు డిగ్రీ, 198 మంది అభ్యర్థులు డాక్టరేట్లు ఉన్నట్లు పేర్కొంది. పలువురు తమ విద్యార్హతలను వెల్లడించలేదు. కాగా మిగిలిన ఆరు, ఏడు దశల ఎన్నికలు మే 25, జూన్ 1 జరగనున్నాయి.
లోక్‌సభ ఎన్నికల ఆరో విడతలో భాగంగా 6 రాష్ట్రాలు, రెండు UTల్లోని 58 స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. యూపీలో 14, హరియాణా 10, బిహార్ 8, పశ్చిమ బెంగాల్ 8, ఢిల్లీ 7, ఒడిశా 6, ఝార్ఖండ్ 4, జమ్మూ కశ్మీర్‌లో ఒక స్థానానికి ఓటర్లు తీర్పునివ్వనున్నారు. ఇప్పటివరకు 5 విడతల్లో 25 రాష్ట్రాలు/UTల్లోని 428 నియోజకవర్గాలకు ఓటింగ్ పూర్తయింది. రేపటితో ఈ సంఖ్య 486కు చేరుకోనుంది.