లిక్కర్ స్కాం కేసులో నిన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు (Arvind Kejriwal) ఏప్రిల్ 15 వరకు జ్యూడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ జైలులో ఏం చేస్తారని అందరు అనుకుంటారు. తీహార్ జైలులో ఇతర ఖైదీలతోపాటే కేజ్రీవాల్ దిన చర్య స్టార్ట్ అవుతుంది.
కేజ్రీవాల్ దినచర్య
డైలీ మార్నింగ్ 6.30 గంటలకు నిద్ర లేస్తారు. టీ, బ్రెడ్ అల్పాహారంగా ఇస్తారు. స్నానం తర్వాత విచారణ ఉంటే కోర్టుకు లేకుంటే తన లాయర్లతో మీటింగ్‌లో పాల్గొంటారు.
ఉదయం 10.30–11.00 గంటల మధ్య పప్పు, ఓ కూరతోపాటు అన్నం లేదా 5 రోటీలతో భోజనం అందించనున్నారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన తన సెల్లోనే ఉంటారు.
3.30 గంటలకు కప్పు టీ, రెండు బిస్కెట్లు తీసుకుంటారు.
సాయంత్రం 4 గంటలకు మళ్లీ తన లాయర్లకు కలుసుకునే అవకాశం ఉంటుంది.
సాయంత్రం 5.30 గంటలకు డిన్నర్ చేసి, మళ్లీ రాత్రి 7 గంటలకు తన సెల్‌లోకి వెళతారు.
వార్తలు, వినోదం, క్రీడలతో సహా 18 నుంచి 20 చానళ్లు చూసేందుకు అనుమతి ఇచ్చారు.
కేజ్రీవాల్‌కు 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారు.