అమెరికా షార్ట్ పెల్లింగ్ కంపెనీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ తాజాగా చేసిన ఆరోపణలను అదానీ గ్రూపు ( Adani Group ) తిరస్కరించింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఇన్వెస్టర్లను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఈ ఆరోపణలు చేసిందని అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
వాస్తవాలు లేకుండా ఆ కంపెనీ చట్టం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలిపారు. సెబీ చైర్ పర్సన్ మాధాబి పూరి ఐచ్, ఆమె భర్తకు.. విదేశాల్లో అదానీ గ్రూప్ అనుబంధ సంస్థల్లో షేర్లు ఉన్నాయని హిండెన్ బర్గ్ తాజా ఆరోపణల సారాంశం. నిరాశాపూరిత వాతావరణంలో భారతీయ చట్టాలను పూర్తిగా ధిక్కరిస్తూ హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసిందని అదానీ గ్రూప్ పేర్కొంది.
'అదానీ గ్రూపునకు వ్యతిరేకంగా పదేపదే హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేస్తున్న నిరాధార ఆరోపణలను మేం పూర్తిగా తిరస్క రిస్తున్నాం. ఈ సంస్థ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని దర్యా పులో రుజువైంది. గత జనవరిలో సుప్రీంకోర్టు కూడా హిండెన్ బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చింది' అని అదానీ గ్రూప్ తన ప్రకట నలో తెలిపింది. తమ విదేశీ కంపెనీలు పూర్తిగా పారదర్శకంగా పని చేస్తున్నాయని పేర్కొంది.