Adani Group : ఆరోపణలపై అదానీ గ్రూప్ స్పందన

Update: 2024-11-22 07:15 GMT

సోలార్‌ పవర్‌ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి లంచం ఇవ్వజూపారంటూ వచ్చిన అభియోగాలను అదానీ గ్రూప్‌ తోసిపుచ్చింది. అదానీ గ్రూపుపై అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టి పారేసింది. చట్టాలకు లోబడి తమ గ్రూపు నడుచుకుంటోందని వివరణ ఇచ్చింది. న్యాయపరంగా ముందుకెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపింది. సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులు దక్కించుకోవడంలో భాగంగా అదానీ గ్రూపు 2,100 కోట్ల రూపాయలు భారత అధికారులకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిందంటూ ఆరోపణలు వచ్చాయి. దీనితో పాటు దాని గురించి ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. గౌతమ్‌ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదైంది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూపు స్టాక్స్‌ డౌన్ అయ్యాయి.

Tags:    

Similar News