అమెజాన్ ఇండియా అధిపతిగా సమీర్ కుమార్ ( Samir Kumar ) నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బుధవారం ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నట్లు పేర్కొంది. మనీష్ తివారీ రాజీనామా అనంతరం ఆ స్థానంలో సమీర్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారని వెల్లడించింది.
సమీర్ కుమార్ 1999లో అమెజాన్లో చేరారు. 2013లో అమెజాన్. ఇన్ ను తీసుకొచ్చిన బృంద సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. అమెజాన్ వ్యాపార విభాగంలో భారత్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. "భారత్లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆసక్తిగా ఉన్నాం. అమెజాన్.ఇన్ తీసుకురావడంలో సమీర్ కుమార్ కీలక పాత్ర పోషించారు' అని అమెజాన్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ అన్నారు.
అమెజాన్ ఇండియా అధి పతిగా ఉన్న మనీశ్ తివారీ ఆగస్టు 6న తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీకి వెలుపల ఇతరత్రా వృద్ధి అవకాశాలను అంది పుచ్చుకోవడానికి తివారీ రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానంలో తాజాగా సమీర్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.