యాక్టింగ్ పై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఏఎస్ అధికారి

ఉత్తరప్రదేశ్‌ జౌన్‌పూర్‌కు చెందిన IAS అధికారి అభిషేక్ సింగ్ యాక్టింగ్ కెరీర్ పై మక్కువతో డ్యూటీ చేస్తూనే అనేక చిత్రాలలో నటించారు.

Update: 2023-10-05 05:29 GMT

ఉత్తరప్రదేశ్‌ జౌన్‌పూర్‌కు చెందిన IAS అధికారి అభిషేక్ సింగ్ యాక్టింగ్ కెరీర్ పై మక్కువతో డ్యూటీ చేస్తూనే అనేక చిత్రాలలో నటించారు. గత ఏడాది నవంబర్‌లో తన కొత్త అసైన్‌మెంట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో డిపార్ట్ మెంట్ కి అతడి గురించి తెలిసింది. దాంతో అతడిని గుజరాత్ ఎన్నికల డ్యూటీ నుండి తొలగించారు. రెండు పడవల మీద కాళ్లు పెట్టి నడవడం కష్టం అని భావించి అభిషేక్ ఎంతో కష్టపడి సాధించుకున్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్)కి రాజీనామా చేశారు. తనకున్న ప్యాషన్ నే కెరీర్ గా మలుచుకోవాలనుకున్నారు. ఫిబ్రవరి 2023లో అతన్ని సర్వీసు నుండి సస్పెండ్ చేశారు. నెట్‌ఫ్లిక్స్ లో "ఢిల్లీ క్రైమ్" అనే సిరీస్ అతడి పలు ప్రశంసలు తెచ్చిపెట్టింది. షార్ట్ ఫిల్మ్ చార్ పాండ్రాలో కూడా కనిపించాడు. బి ప్రాక్ యొక్క దిల్ తోడ్ కే పాటలో నటించాడు.

అభిషేక్ భార్య దుర్గా శక్తి నాగ్‌పాల్ బండా జిల్లా జిల్లా మేజిస్ట్రేట్ (DM)గా ఉన్నారు. గత నెలలో జౌన్‌పూర్‌లో గణేషోత్సవం ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వహించాడు, ఈ వేడుకల్లో ముంబైకి చెందిన కొంతమంది సినీ తారలు కూడా పాలు పంచుకున్నారు. రాజకీయాల్లో కూడా రాణించేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు అభిషేక్. 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2022లో గుజరాత్ ఎన్నికల విధుల నుంచి తప్పుకున్న తర్వాత అభిషేక్ సింగ్ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని శిరసావహించినట్లు చెప్పారు. 

2015లో అభిషేక్ సింగ్‌కు ఢిల్లీ ప్రభుత్వంలో మూడేళ్లపాటు డిప్యూటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అతడి డిప్యుటేషన్ ను రెండేళ్లు పొడిగించారు. అయితే, మధ్యలో అతను సినిమాల్లో, సిరీస్ లో నటించేందుకుగాను మెడికల్ లీవ్‌పై వెళ్లాడు, ఢిల్లీ ప్రభుత్వం అతనిని మళ్లీ ఉత్తరప్రదేశ్‌కు పంపింది. కానీ చాలా కాలం డ్యూటీలో చేరలేదు. డిపార్ట్‌మెంట్ ఆయనను ఈ విషయంపై ప్రశ్నించినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

అభిషేక్ సింగ్ భార్య దుర్గా శక్తి నాగ్‌పాల్ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన IAS అధికారి. UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు B.Tech పూర్తి చేశారు. ఆమె ఆలిండియా 20వ ర్యాంక్ సాధించి ప్రతిష్టాత్మకమైన IAS క్యాడర్‌లోకి ప్రవేశించేందుకు ఆమె కృషి, పట్టుదల నిదర్శనంగా నిలిచాయి. 

Tags:    

Similar News