Arvind Kejriwal : సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

Update: 2024-04-10 10:31 GMT

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సవాల్ చేశారు. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం లో పిటిషన్ దాఖలు చేసినట్లు కేజీవాల్ తరఫున న్యాయవాది వివేక్ జైన్ వెల్లడించారు. హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా వ్యాజ్యంలో అభ్యం తరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే సుప్రీంకోర్టులో ఆయన వేసిన పిటిషన్ ను అత్య వసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యా యస్థానం నిరాకరించింది.

హైకోర్టులో మరో ఎదురుదెబ్బ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. లిక్కర్ పాలసీ స్కాం కేసుకు సంబంధించి ఆయన వేసిన మరో పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. కేజీవాల్ తరఫు లాయర్ కు సూచించింది. కేసు విచారణ సమయం లేదా తేదీని పేర్కొనడానికి నిరాకరించింది. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న అరెస్టయిన కేజీవాల్ ప్ర స్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు వారానికి ఐదు సార్లు లాయర్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. అయితే కోర్టు అందుకు అనుమతి నిరాకరిస్తూ.. ఆయన పిటిషన్ ను ను తిరస్కరించింది.

Tags:    

Similar News