లిక్కర్ స్కామ్ కు సంబంధించి సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. శుక్రవారం ఉదయం ఈడీ కేసులో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే, లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేజ్రీవాల్ పై సీబీఐ కేసు కూడా ఉండటంతో ఆయన తిహార్ జైలులోనే ఉన్నారు. సీబీఐ కేసుకు సంబంధించి శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. శుక్రవారం ఉదయం కేజ్రీవాల్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అయితే, సీబీఐ కేసులో ఆయన కస్టడీని ఈ నెల 25 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.