ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన రోజే తన విడుదల అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తాను తిహార్ జైలు నుంచి బయటకు వస్త్రానని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజీవాల్ అన్నారు.
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇండియా కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే మెజారిటీ వస్తే జూన్ 5నే తాను జైలు నుంచి విడుదలవుతానని ఆప్ కౌన్సిలర్లతో సోమవారం జరిగిన సమావేశంలో కేజ్రివాల్ అన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం ఆయనకు బెయిల్ ఇచ్చింది కోర్టు.