Ayushman Card: ఆయుష్మాన్ కార్డును ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు వాడవచ్చు?

Update: 2025-11-21 07:45 GMT

Ayushman Card: రోగాలు ఎప్పుడూ చెప్పి రావు.. కానీ వచ్చినప్పుడు శారీరక కష్టం తో పాటు ఆర్థిక కష్టాలను కూడా తెస్తుంది. ఈ భయాన్ని పోగొట్టడానికి, పేద ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన(PMJAY) ను ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య పథకాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది.

ఆయుష్మాన్ కార్డు అంటే ఏమిటి?

ఆయుష్మాన్ కార్డు అనేది కేవలం ఒక ప్లాస్టిక్ కార్డు కాదు, ఇది పేద కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఆరోగ్య భద్రతా హామీ. డబ్బు లేక వైద్యం ఆగకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ కార్డు ద్వారా లబ్ధిదారులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిలో అయినా చికిత్స పొందవచ్చు. దీని అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఈ సదుపాయం పూర్తిగా క్యాష్‌లెస్. అంటే, ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. రోగి లేదా కుటుంబ సభ్యులు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.

సంవత్సరంలో ఎన్నిసార్లు చికిత్స చేయించుకోవచ్చు?

ఈ కార్డును సంవత్సరంలో ఎన్నిసార్లు ఉపయోగించవచ్చు అనే దానిపై చాలా మందికి సందేహం ఉంటుంది. దీనికి సమాధానం.. ఈ కార్డుపై ఎన్నిసార్లు ఉపయోగించాలనే పరిమితి లేదు, కేవలం మొత్తం పై మాత్రమే పరిమితి ఉంటుంది. ప్రభుత్వం ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల కవరేజీ అందిస్తుంది. మీరు ఈ రూ.5 లక్షలను సంవత్సరంలో ఒక్కసారిగా ఉపయోగించుకున్నా లేదా పదిసార్లు చిన్న చిన్న చికిత్సల కోసం ఉపయోగించుకున్నా అది మీ అనారోగ్యం, చికిత్స అవసరాన్ని బట్టి ఉంటుంది.

పరిమితి పూర్తైతే ఏమి చేయాలి?

ఒకవేళ కార్డు పరిమితి పూర్తైపోతే లేదా సంవత్సరం ముగిసినట్లయితే, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా అని చాలా మంది ఆందోళన చెందుతారు. ఆయుష్మాన్ భారత్ పథకం చాలా ఆధునికంగా, ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. ఆ రూ.5 లక్షల పరిమితి మొత్తం ఒక ఆర్థిక సంవత్సరానికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఒకేసారి రూ.5 లక్షలు ఖర్చైపోతే, ఆ సంవత్సరంలో మిగిలిన రోజులలో మీరు ఉచిత వైద్యం పొందలేరు. అప్పుడు రోగి తదుపరి ఆర్థిక సంవత్సరం వచ్చే వరకు వేచి ఉండాలి. అయితే ఈ పథకంలో రెన్యూవల్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటిక్. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే మీ ఆయుష్మాన్ కార్డు వాలెట్ ఆటోమేటిక్‌గా టాప్-అప్ అవుతుంది. ప్రభుత్వం తరపున మీకు మళ్లీ రూ.5 లక్షల కొత్త లిమిట్ యాడ్ అవుతుంది. దీనికోసం లబ్ధిదారులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు, ఫారం నింపాల్సిన పని లేదు, ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

Tags:    

Similar News