Swami Chaitanyananda Saraswati: ఢిల్లీ ఫేక్ బాబా గదిలో దొరికిన చండాలం , గది నిండా ఆ బొమ్మలే
మోదీ, ఒబామా, బ్రిటన్ నేతలతో దిగినట్లు నకిలీ ఫొటోలు లభ్యం
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఫేక్ బాబా అలియాస్ స్వామి చైతన్యానంద సరస్వతి కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. అధికారులు అతడి ఆశ్రమంలో తనిఖీలు నిర్వహించగా శృంగార బొమ్మతో పాటు అశ్లీల చిత్రాలకు సంబంధించిన సీడీలు లభ్యమైనట్లు సమాచారం. వీటితో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్రిటన్ నేతలతో దిగినట్లుగా ఉన్న నకిలీ ఫొటోలు లభ్యమయ్యాయి.
ఢిల్లీలోని ఒక కళాశాల నిర్వహణ కమిటీలో సభ్యుడిగా ఉన్న ఢిల్లీ బాబా అక్కడి విద్యార్థుల నుండి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 17 మంది విద్యార్థులను వేధించాడనే ఆరోపణలతో చైతన్యానందను ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఆగ్రాలోని తాజ్ గంజ్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా తప్పించుకుని బృందావన్, మధుర, ఆగ్రాలలో చైతన్యానంద సరస్వతి తిరుగుతూ వచ్చాడు. తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు పలు ప్రయత్నాలు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చైతన్యానంద సరస్వతి సెప్టెంబర్ 27న పార్థ సారథి అనే పేరుతో ఆగ్రాలోని ఒక హోటల్‌లో బస చేశాడు. అక్కడే పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసులు అతనిని విచారిస్తున్నారు.