బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై ( Amit Malviya ) కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనటె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్వియా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్‌లోని ఫైవ్ స్టార్ హోటల్స్‌తో పాటు బీజేపీ కార్యాలయాల్ని వినియోగించారని ఆరోపించారు.
ఇదే విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన శంతను సిన్హా… తనతో చెప్పినట్లు సుప్రీయా శ్రీనటె బయటపెట్టారు. తక్షణమే మాల్వియాపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధినాయకత్వాన్ని సుప్రియా శ్రీనటె డిమాండ్ చేశారు.
అయితే ఈ ఆరోపణల్ని అమిత్ మాల్వియా ఖండించారు. తనపై శంతను సిన్హా నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తున్న వారిపై తాను పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు.