BJP Lucky Number : బీజేపీ లక్కీ నెంబర్ 8

Update: 2024-06-06 07:40 GMT

ఏపీ, తెలంగాణలో ఫలితాలు బీజేపీ లక్కీ నెంబర్ 8 అని తేల్చేశాయి. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటు ప్రస్తుతం ఏపీ శాసనసభ, తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్ల సంఖ్య 8. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రస్తుతం తెలంగాణలో లోక్సభలో 17 స్థానాల్లో పోటీచేయగా బీజేపీ 8 చోట్ల గెలిచింది.

మరోవైపు ఏపీ అసెంబ్లీలో 10 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయగా 8 చోట్ల విజయం సాధించారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లక్కీ నెంబర్ అని వైరల్ అవుతోంది. తెలంగాణ లోక్సభలో 2019 ఎన్నికల్లో బీజేపీ 4 స్థానాల్లో గెలిచింది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచింది. తాము తెలంగాణలో 8 సీట్లు గెలుస్తామంటూ బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా కొద్దిరోజుల ముందు ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు.

ఏపీలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీచేయగా.. సగం స్థానాల్లో గెలిస్తే మంచి రిజల్ట్ వచ్చినట్లేనని బీజేపీ నేతలు భావించారు. ఊహించినదానికంటే ఎక్కువుగా మొత్తం 8 స్థానాల్లో గెలుపొందటంతో బీజేపీకి 8 లక్కీ నెంబర్ మారిందనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News