Fireworks Explosion: తమిళనాడులో బాణసంచా పేలి ఏడుగురి మృతి

మృతులలో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు;

Update: 2025-04-27 03:00 GMT

తమిళనాడులోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన బాణసంచా పేలుళ్లలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు బాలురు, నలుగురు మహిళలు ఉన్నారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. విరుదునగర్, సేలం జిల్లాల్లో ఈ ప్రమాదాలు సంభవించాయి.

విరుదునగర్ జిల్లా శివకాశిలోని ఒక బాణసంచా ఫ్యాక్టరీలో కార్మికులు రసాయనాల మిశ్రమాన్ని సిద్ధం చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సేలం జిల్లా కంచనాయకన్‌పట్టి గ్రామంలో ద్రౌపది అమ్మవారి ఆలయ రథోత్సవం సందర్భంగా కొందరు బాణసంచా కాల్చారు. ఆ నిప్పు రవ్వలు బైక్‌పై ఉంచిన బాణసంచా బస్తాపై పడి అంటుకున్నాయి. అందులో శక్తిమంతమైన టపాసులు పేలడంతో 11 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ సహా నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News