Breaking : రాజస్థాన్ సీఎంకు కరోనా పాజిటివ్

Update: 2024-03-06 08:55 GMT

రాజస్థాన్ ముఖ్యమంత్రి (Rajasthan CM) భజన్‌లాల్ శర్మకు (Bhajanlal Sharma) కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా Xలో పోస్ట్‌లో చేసిన ఆయన.. పలు ఆరోగ్య సమస్యల కారణంగా, తాను ఆరోగ్య పరీక్ష చేయించుకున్నానని, అది కరోనా వైరస్ పాజిటివ్ అని చూపించిందని చెప్పారు. "నేను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నాను. వైద్యుల సలహాలను పూర్తిగా అనుసరిస్తున్నాను. వర్చువల్ మాధ్యమం ద్వారా రాబోయే అన్ని కార్యక్రమాలలో పాల్గొంటాను" అని సీఎం శర్మ జోడించారు.

Tags:    

Similar News