CAA : సీఏఏ పొలిటికల్ గేమ్.. సీఎం ఎటాక్

Update: 2024-03-13 06:28 GMT

దేశంలో సిటిజన్ అమెండ్ మెంట్ యాక్ట్ (CAA) 2019 అమలులోకి వచ్చింది. దీనిపై ప్రతిపక్షాలు ఘాటుగా స్పందిస్తున్నాయి. కొన్ని దశాబ్దాల నుంచి అమలులోకి వచ్చేందుకు పెండింగ్ లో ఉన్న ఈ చట్టానికి కొన్ని మార్పులతో నరేంద్ర మోడీ సర్కారు 2019లోనే ఆమోదించి చట్టంగా మార్చింది. దీని అమలుకు కరోనా సమయం, నిరసనలు అడ్డుపడ్డాయి. ఐతే.. ప్రజల్లో దీనిపై విస్తృత ప్రచారం తర్వాత.. సరిగ్గా 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు అమలులోకి తీసుకొచ్చింది కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం.

2015 కు ముందు దేశంలోకి వలస వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్న పొరుగు దేశాల్లోని పౌరులకు సీఏఏతో భారత పౌరసత్వం లభిస్తుంది. ఐతే.. సీఏఏ అమలుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ నిధులను మన దేశస్తులకు వెచ్చించకుండా పాకిస్తానీలకు ఖర్చు చేయాలని చూస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.

నరేంద్ర మోడీ (Narendra Modi) తన పదేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేక.. సీఏఏను రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు కేజ్రీవాల్. యువతకు ఉపాధి, పేదలకు వసతిపై ఆలోచన చేయకుండా సీఏఏ గురించి మాట్లాడటం బాధాకరమన్నారు. మన దేశయువతకే ఉపాధి కల్పించలేని కేంద్ర ప్రభుత్వం.. పాకిస్థాన్‌ మైనారిటీలకు ఉద్యోగాలు ఇస్తామని ఎలా చెబుతుందని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Tags:    

Similar News