కేంద్ర ప్రభుత్వం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలాన్ని పొడిగించింది. సెప్టెంబర్ 24,జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలాన్ని పొడిగించింది. సెప్టెంబర్ 24, 2025న కేబినెట్ అపాయింట్‌మెంట్ కమిటీ (ACC) ఈ పొడిగింపును ఆమోదించింది. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం మే 30, 2026 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు పొడిగించబడింది. సీడీఎస్‌కు గరిష్ట పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. జనరల్ అనిల్ చౌహాన్ వచ్చే ఏడాది మే నెలలో 65 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. ఆయన సీడీఎస్‌గా కొనసాగడంతో పాటు, రక్షణ మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ కార్యదర్శిగా కూడా పనిచేస్తారు. జనరల్ అనిల్ చౌహాన్ సెప్టెంబర్ 28, 2022న భారతదేశంలో రెండవ సీడీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. మొదటి సీడీఎస్‌గా జనరల్ బిపిన్ రావత్ ఉండేవారు. జనరల్ చౌహాన్ భారత సైన్యంలో 1981లో చేరారు. ఆయన తన అసాధారణమైన సేవలకు గాను పరమ్ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్ మరియు విశిష్ట సేవా మెడల్ వంటి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు.