చార్‌ధామ్ యాత్రకు వచ్చిన భక్తులు తీవ్ర అవస్తలు ఎదుర్కొంటున్నారు. ఇసుకేస్తే రాలనంత జనం ఉండటంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తి ప్రాణాలు కోల్పోతున్నారు. యాత్ర ప్రారంభమైన 15 రోజుల్లోనే 52 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఎక్కువమంది 60 ఏళ్లకు పైబడినవారేనని చెప్పారు. గుండెపోటుతోనే ఎక్కువమంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. శుక్రవారం దెహ్రాదూన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గంగోత్రిలో ముగ్గురు, యమునోత్రిలో 12 మంది, బద్రీనాథ్‌లో 14 మంది, కేదార్‌నాథ్‌లో 23 మంది మృత్యువాత పడినట్లు చెప్పారు.
చార్‌ధామ్ తీర్థయాత్రకు భక్తులు లక్షల్లో తరలివస్తారు. వారి కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే చార్‌ధామ్ దేవాలయాలను భక్తులు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మంచు ప్రభావం తదితర కారణాలతో మిగతా ఆరు నెలలు ఆలయాలను మూసివేస్తారు. వేసవి వాతావరణం మాత్రమే యాత్రకు అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో చార్‌ధామ్ దేవాలయాల దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు.