Yuvraj Singh : ఎన్నికల్లో పోటీపై యువరాజ్ క్లారిటీ

Update: 2024-03-02 10:15 GMT

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) తాను పోటీ చేయనున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఖండించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున పోటీదారుగా యువరాజ్ పేరు ఉన్నట్టు ఇటీవల వార్తలు వ్యాపించారు. అయితే రెండుసార్లు ప్రపంచ కప్ విజేత అయిన యువరాజ్.. ఈ వార్తలను ఖండించారు. యువరాజ్ తన యువికెన్ ఫౌండేషన్ ద్వారా సేవలు కొనసాగిస్తానని చెప్పాడు.

"మీడియా నివేదికలకు విరుద్ధంగా, నేను గురుదాస్‌పూర్ నుండి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు" అని యువరాజ్ తన X పోస్ట్‌లో రాశాడు. రాజకీయాల కన్నా ప్రజలకు సాయం చేయడమే తనకు ఇష్టం అని, ‘యువీకెన్​’ ఫౌండేషన్​ ద్వారా.. తన దాతృత్వ ప్రయత్నాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్టు పునరుద్ఘటించాడు.

భారత మాజీ క్రికెటర్ యువరాజ్​ సింగ్, తన తల్లి షబ్నమ్ సింగ్​తో కలిసి ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ ప్రవేశంపై విపరీతంగా చర్చలు జరిగాయి. గురుదాస్​పూర్​ నుంచి ఆయన పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగాయి.

Tags:    

Similar News