పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సాధారణ పరీక్షల కోసం SSKM నుండి వైద్యుల బృందం ఆమె ఇంటికి వెళ్ళింది. ఆసుపత్రి వర్గాల ప్రకారం, మమతకు ఆమె నివాసం, మందుల నుండి చికిత్స చేయవచ్చని, అవసరమైన పరీక్షలు మళ్లీ నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా SSKM డైరెక్టర్ మోనిమోయ్ బంధోపాధ్యాయ మాట్లాడుతూ, మార్చి 14న అర్థరాత్రి 'వెనుక నుండి ఎవరో నెట్టారు' అని తాను చేసిన వ్యాఖ్యను.. 'తప్పుగా అర్థం చేసుకున్నారు' అని, కానీ కేవలం అలా జరిగి ఉండవచ్చనే చెప్పానన్నారు. "నా వ్యాఖ్యను తప్పుగా అన్వయించుకుంటున్నారు. నా ఉద్దేశ్యం ఏమిటంటే, ఆమె ఒత్తిడికి గురై కిందపడిందని. చికిత్స అందించడమే నా పని కాబట్టి నేను ఇంతకు మించి ఏమీ చెప్పలేను" అని బంధోపాధ్యాయ అన్నారు.
గురువారం నాడు, నుదిటిపై గాయం మీద అనేక కుట్లు వేసిన తరువాత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ SSKM ఆవరణలోని వీల్ చైర్‌లో బంగూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్‌లో CT స్కాన్ చేయించుకుని, ఆపై ఆసుపత్రి నుండి విడుదలైనారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ లాల్‌బజార్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సంఘటనపై ఎటువంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడలేదు.