కాలికి చుట్టుకున్న కాల నాగు.. శివుడిని ప్రార్థిస్తూ ఆమె మూడు గంటలు..
పాము.. ఆ పేరు తలవాలంటే కూడా భయం వేస్తుంది. అలాంటిది ఆమె కాలుకి చుట్టుకుంది.
పాము.. ఆ పేరు తలవాలంటే కూడా భయం వేస్తుంది. అలాంటిది ఆమె కాలుకి చుట్టుకుంది.. ఇంట్లోకి ఎలా ప్రవేశించిందో కానీ వచ్చి ఆమె కాలుకి చుట్టుకుంది. ఏదో జన్మలో బంధం ఉన్నట్లు.. అయితే అంత విషసర్పం ఆమెను ఏమీ చేయకపోవడం విశేషం. క్రూ జంతువులైనా వాటికి హాని చేస్తే అవి కూడా తిరిగి రివెంజ్ తీర్చుకుంటాయనడానికి ఇది నిదర్శనమేమో, మూడు గంటల పాటు ఆ మహిళ నరకయాతన అనుభవించింది. గుండె జారిపోయింది. కదిలితే కాటేస్తుందేమో అని మనసులో శివుడిని ప్రార్థిస్తూ అలాగే కూర్చుండి పోయింది. వినడానికి కూడా భయంగా ఉంది. ఆమె అలా ఎలా అంత నిబ్బరంగా ఉందో అర్థం కాలేదు చుట్టు పక్కల వారికి.
ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కింగ్ కోబ్రా తన కాలికి చుట్టుకోవడంతో ఒక మహిళ భయానక పరిస్థితిని ఎదుర్కొంది. నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని దహర్రా గ్రామంలో నివసిస్తున్న మహిళ ఇంట్లోకి నాగుపాము చొరబడింది. మూడు గంటల పాటు పాము ఇంట్లో నివసిస్తున్న మహిళ కాలుకి చుట్టుకుంది. ఒకపక్క భయంతో చెమటలు కక్కుతున్నప్పటికీ ఆమె తన నిగ్రహాన్ని కొనసాగించింది. శివుడి మీద భారం వేసి ప్రార్థించింది.
కుటుంబసభ్యులు డయల్ 112 ఎమర్జెన్సీ సర్వీస్ డిస్ట్రెస్ కాల్ చేశారు. కానీ వారు రావడానికి చాలా సమయం పట్టింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న పాములు పట్టేవాడి సహాయం తీసుకున్నారు. ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాముగా పేరుగాంచిన కింగ్ కోబ్రాను అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. మహిళకు లేదా పాముకు ఎలాంటి హాని కలగకుండా నిపుణుడు సురక్షితంగా పామును తొలగించారు. తరువాత దానిని నివాస ప్రాంతాలకు దూరంగా సమీపంలోని అడవిలో వదిలేసి వచ్చారు.