Corona Update: దేశంలో కొత్తగా 2 లక్షల కరోనా కేసులు.. 3.85 శాతానికి పెరిగిన ఇన్ఫెక్షన్ రేటు..

Corona Update: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. కొత్తగా 2లక్షల 68వేల 833 కేసులు నమోదయ్యాయి.

Update: 2022-01-15 12:04 GMT

Corona Update: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. కొత్తగా 2లక్షల 68వేల 833 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 14లక్షల 17వేల 820కి చేరాగా.. మొత్తం కేసుల సంఖ్య 3కోట్ల 67లక్షలకు చేరింది. వీటిలో 6,041 ఒమిక్రాన్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 70కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజా కేసులతో దేశంలో పాజిటివిటీ రేటు 14.7 నుంచి 16.66 శాతానికి పెరిగింది.

ఇన్‌ఫెక్షన్‌ రేటు కూడా 3.85శాతానికి పెరిగింది. ఢిల్లీ, మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. దేశరాజధానిలో కొత్తగా మరో 20వేల కేసులు నమోదవ్వగా.. మహారాష్ట్రలో 43,211 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఒడిస్సాలో కూడా కొత్తగా 10,856 కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్ర అధికంగా ఉండటంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి.

కరోనా ఆంక్షలను ఈనెల 31 వరకు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం పొడిగింది. ఈనెల 23న నెతాజీ సుభాష్‌చంద్రబోస్‌ జయంతిని పురస్కరించుకుని తలపెట్టిన ర్యాలీని కూడా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. అటు మధ్యప్రదేశ్‌లో జైళ్లలో మార్చి నెలాఖరు వరకు ములాఖత్‌లను నిలిపివేశారు. బయటవారి నుంచి జైళ్లకు కరోనా వ్యాప్తించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ప్రభుత్వం కూడా స్కూళ్లకు సెలవులను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 16వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించగా.. 17 నుంచి స్కూళ్లు తెరవాల్సి ఉంది. మరోవైపు ఈనెల 20 వరకు రాష్ట్రంలో ర్యాలీలు, సభలను నిషేధిస్తూ ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. దీంతో స్కూళ్లకు ఈ నెల 20 వరకు సెలవులు పొడిగించే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News