న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ( Arvind Kejriwal ) జ్యూడిషల్ కస్టడిని జులై 3 వరకు రూస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఆయన రెగ్యులర్ బెయిల్ పిటీషన్ వాదనలను కోర్డు విన్నది.
లిక్కర్ కేసులో ప్రస్తుతం కేజ్రివాల్ తీహార్ జైలులో జ్యూడిషల్ కస్టడీలో ఉన్నారు. లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రివాల్ వందకోట్ల లంచం డిమాండ్ చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో మనీలాండరింగ్ నేరంపై కోర్టు విచారణ చేపట్టిందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్పీ రాజు తెలిపారు.
ఈ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా సహా నిందితుల బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడం మనీలాండరింగ్ అబియోగా న్ని కోర్టు అంగీకరిస్తోందని చెప్పారు. మీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రివాల్ ను కోర్టుకు హాజరుపరిచారు.