పరువు నష్టం కేసులో ‘నర్మదా బచావో ఆందోళన్’ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. మేధా పాట్కర్, వీకే సక్సేనా(ప్రస్తుత ఢిల్లీ LG) మధ్య 2000 సంవత్సరం నుంచి ఈ కేసు నడుస్తోంది. అప్పట్లో సక్సేనా ఓ NGOకు చీఫ్‌గా ఉన్నారు. తన పరువుకి భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, పత్రికా ప్రకటనలు ఇచ్చారని పాట్కర్‌పై సక్సేనా కేసు పెట్టారు.
సక్సేనా గతంలో అహ్మదాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు చీఫ్‌గా ఉండేవారు. నర్మదా బచావ్ ఆందోళన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ఇవ్వడంతో ఆయనపై పాట్కర్ కేసు పెట్టారు. తనపై పాట్కర్ టీవీల్లోనూ, పత్రికా ప్రకటనల రూపంలోనూ పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ ఆయన పరువు నష్టం దావా వేశారు. ఈ దావాపైనే ప్రస్తుతం కోర్టు నిర్ణయాన్ని వెలువరించింది.