Court Rules : మతిస్థిమితం లేని వారితో సెక్స్ అత్యాచారమే.. కోర్టు తీర్పు

Update: 2024-04-29 09:21 GMT

మానసిక స్థితి, అత్యాచారంపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతిస్థిమితం సరిగా లేని మహిళల సమ్మతితో చేసే శృంగారాన్ని అత్యాచారంగానే పరిగణించాలని ముంబైలోని సెషన్స్‌ కోర్టు పేర్కొంది. మానసిక వైకల్యంతో బాధపడేవారు ప్రకృతి, పర్యావసానాలు అర్థం చేసుకోలేరని కోర్టు అభిప్రాయపడింది.

తన పొరుగింటిలో ఉంటున్న మతిస్థిమితం లేని మహిళ (23)తో ఆమె ఇష్టపూర్వకంగానే ఓ 24 ఏళ్ల యువకుడు శృంగారం చేశారు. ఆమె గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అతడికి 10 ఏళ్ల జైలు శిక్షను కోర్టు ఖరారు చేసింది. ఆమె మానసిక వయస్సు ఆరు నుండి తొమ్మిదేళ్ల పిల్లల వయస్సుగా అంచనా వేయబడింది. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నా.. అతను ముస్లిం, మహిళ హిందువు కావడంతో తల్లిదండ్రులు ఈ వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది.

ఇది జనవరి 9, 2019న కురార్ పోలీస్ స్టేషన్‌లో రిజిస్టర్ అయిన కేసు. మహిళ తల్లి నమోదు చేసిన కేసు ప్రకారం.. వైద్య పరీక్షలో బాధితురాలు మూడు నెలల గర్భవతి అని తేలింది. కేసులో వాదనలు పూర్తయిన తర్వాత.. కోర్టు కీలక ఆదేశాలు ఇస్తూ తీర్పు చెప్పింది.

Tags:    

Similar News