West Bengal : 5కి చేరిన తుఫాను మృతుల సంఖ్య.. దీదీ పరామర్శ

Update: 2024-04-01 07:19 GMT

ఉత్తర పశ్చిమ బెంగాల్‌లోని (West Bengal) జల్‌పైగురి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 5కు పెరిగిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తెలిపారు. మార్చి 31న జిల్లా హెడ్ క్వార్టర్స్ పట్టణంలోని చాలా ప్రాంతాలు, పొరుగున ఉన్న మైనగురిలోని అనేక ప్రాంతాలలో వడగళ్లతో కూడిన బలమైన గాలులు వీయడంతో అనేక గుడిసెలు, ఇళ్లు దెబ్బతిన్నాయి, చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో 100 మందికి పైగా గాయపడ్డారు.

ఆదివారం అర్థరాత్రి జిల్లాకు చేరుకున్న ముఖ్యమంత్రి ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. "ఇప్పటి వరకు, ఐదుగురు మరణించినట్లు మాకు నివేదికలు ఉన్నాయి. గాయపడిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. తుపానులో గాయపడిన వారిని, మరణించిన వారి కుటుంబ సభ్యులను కలిశాను. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుంది" అని ఆమె తెలిపారు.

పరిహారం అందించడం గురించి అడిగినప్పుడు, బెనర్జీ, “మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున, దాని గురించి నేను ఏమీ చెప్పలేను. మేం జిల్లా యంత్రాంగంతో మాట్లాడాలన్నారు. జిల్లాలో ఎక్కువగా ప్రభావితమైన ప్రాంతాలలో రాజర్‌హట్, బర్నిష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి వంటి అనేక ప్రాంతాల్లో ఎకరాల వ్యవసాయ భూమి, పంటలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News