Delhi : గ్యాంగ్‌స్టర్లకు రాజధానిగా ఢిల్లీ.. సీఎం ఆతిశీ కీలక కామెంట్స్

Update: 2024-11-21 10:15 GMT

ముఖ్యమంత్రి ఆతిశీ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్‌స్టర్లకు ఈ ప్రాంతం రాజధానిగా మారిందన్నారు. ఇటీవల హత్యకు గురైన యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన ఆమె.. కేంద్రమంత్రి అమిత్‌ షాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని అన్నారు. ఇటీవల సుందర్‌ నగరీలో ఇద్దరు వ్యక్తులు ఓ మహిళను వేధిస్తుండగా.. ఆమె కుటుంబీకులు, బంధువులు ఆ యువకులను మందలించారు. అనంతరం ఆ ఇద్దరు కత్తులతో చేసిన దాడిలో 28 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధిత కుటుంబాన్ని కలిసిన సీఎం ఆతిశీ వారిని పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం అందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News