Uttarakhand : ఉత్తరాఖండ్ ను ముంచెత్తిన వరద 10 మంది మృతి.. నలుగురు గల్లంతు
ఓ వైపు కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో ప్రకృతి విపత్తు కారణంగా వందల మంది చనిపోగా.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను భారీ వానలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్ లో నదులన్నీ ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు కూలిపోయాయి. వర్షం కారణంగా కేదార్‌నాథ్‌లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. డెహ్రాడూన్,
హల్ద్వాని, చమోలి జిల్లాల్లో నలుగురు గల్లంతయ్యారు. డెహ్రాడూన్ లో పలుచోట్ల ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. హరిద్వార్ ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కన్‌ఖాల్ పోలీస్టేషన్ నీట మునిగింది. భూపత్వాలా, హరిద్వార్, నయా హరిద్వార్, కన్‌ఖాల్, జవల్‌పుర్ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది.