Nirmala Sitharaman : పాకిస్తాన్ కు నిధులు ఇవ్వొద్దు.. నిర్మలమ్మ చర్చలు

Update: 2025-05-06 16:15 GMT

పాకిస్తాన్ పై నీటియుద్ధం ప్రకటించిన భారత్ ఇవాళ మరో అడుగు ముందుకేసింది. అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు రాకుండా అడ్డుకుంటోంది. ముఖ్యంగా ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా మరో చర్య చేపట్టింది. ఉగ్రవాదాన్ని ఎగదోస్తోన్న ఆ దేశానికి నిధులు ఇవ్వొద్దంటూ ఏషియన్ డెవలప్మెంట్ (ఏడీబీ)ను కోరినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఇటలీ ఆర్థికమంత్రితోపాటు, పలు ఐరోపా దేశాల నేతలతోనూ నిర్మలమ్మ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్ప టికే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ గ్రేలి స్టులోకి పాకిస్థాన్ తీసుకువచ్చేలా భారత్ ప్రయత్నిస్తున్నది. ఇక, అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి ఆ దేశానికి అందే 7 బిలియన్ డాలర్ల సాయంపైనా భారత్ ఆందోళన వ్యక్తం చేయనుంది. తాజాగా ఏడీబీ నుంచి అందే నిధులను కూడా నిలిపివేయాలంటూ భారత్ అభ్యర్థన చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరె క్టర్ పరమేశ్వరన్ అయ్యర్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి లో తాత్కాలిక విధులు నిర్వర్తించ నున్నారు. మూడేళ్ల కాలానికి 7 బిలియన్ డాలర్ల ప్యాకేజీ కోసం గత ఏడాది జులైలో ఐఎంఎఫ్్పకాల మధ్య ఒప్పందం ఖరారైంది. ఆ రోజున వివిధ అంశాలతో పాటు పాక్ బెయిలౌట్ ప్యాకేజీపై సమీక్ష జరగనుంది. దీనిని పరమేశ్వరన్ అయ్యర్ వ్యతిరేకించే చాన్స్ ఉంది.

Tags:    

Similar News