Delhi CM : అరవింద్ కేజ్రీవాల్‌కి ఈడీ 8వ సమన్లు

Update: 2024-02-27 09:46 GMT

Delhi : ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) ఎనిమిదో సమన్లు జారీ చేసింది. గతంలో వచ్చిన ఏడు సమన్లను దాటేసిన కేజ్రీవాల్‌ను మార్చి 4న విచారణకు హాజరుకావాలని కోరింది. అంతకుముందు ఆప్ స్పందిస్తూ... ప్రతిరోజూ సమన్లు జారీ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు వెలువడేంత వరకు వేచి ఉండాలని సూచించింది. మార్చి 16న కోర్టులో విచారణ ఉందని.. అంతవరకు సంయమనం పాటించాలని కోరింది. తమపై ఎంత ఒత్తిడి చేసినా... ఇండియా కూటమిని ఆప్ వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

గత వారం కూడా కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, అప్పుడు కూడా ఈడీకి ఆప్ ఇదే సమాధానం ఇచ్చింది. మరోవైపు, కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో ఈడీ స్పందిస్తూ... కుంటి సాకులు చెపుతూ విచారణ నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించింది. ప్రజా జీవితంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులే చట్టాలను గౌరవించకపోతే... అది సామాన్య ప్రజలకు చెడు సంకేతాలను పంపుతుందని వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News