Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గిన ఏక్‌నాథ్ షిండే.. ఎన్ని ఓట్లు వచ్చాయంటే..?
Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ టెస్టులో షిండే సర్కార్ డిస్టింక్షన్‌లో పాస్ అయింది.;
Maharashtra: ఊహించిన విధంగానే బలపరీక్షలో నెగ్గింది షిండే సర్కార్. మహారాష్ట్ర అసెంబ్లీలో జరిగిన ఫ్లోర్ టెస్టులో షిండే సర్కార్ డిస్టింక్షన్‌లో పాస్ అయింది. మ్యాజిక్ ఫిగర్ 144 దాటి ఓట్లు సాధించింది. షిండే సర్కార్‌కు మొత్తం 164 ఓట్లు వచ్చాయి. ఇవాళ్టి బలపరీక్షలో ఈజీగా నెగ్గితీరతామని షిండే-ఫడ్నవిస్ ముందు నుంచే చెబుతున్నారు. మరోవైపు షిండే వర్గంలోకి మరో శివసేన ఎమ్మెల్యే చేశారు. బలపరీక్షకు ముందు శివసేన ఎమ్మెల్యే శ్యామ్‌సుందర్ షిండే.. ఏక్‌నాథ్ షిండేకు మద్దతు తెలిపారు. మొత్తం 40 మంది శివసేన ఎమ్మెల్యేలు బలపరీక్షలో సీఎం ఏక్‌నాథ్ షిండేకు మద్దతుగా ఓటు వేశారు.
ఈ బలపరీక్షను నీతి పరీక్ష అంటూ ట్యాగ్ చేశారు శివసేన లీడర్ ఆదిత్య థాక్రే. అసెంబ్లీ పరిణామాలపై రగిలిపోతున్న ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. శివసేన పార్టీ చీఫ్ విప్‌గా షిండే గ్రూప్‌లోని భరత్ గోగవాలేను నియమించారు. ఆ వెంటనే పార్టీ విప్‌ను ఉల్లంఘించారంటూ 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చారు. ఆ 16 మందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శివసేన పార్టీ చీఫ్ విప్ అజయ్ చౌదరి అంటూ మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌కు శివసేన పార్టీ నేతలు ఇచ్చిన లెటర్‌ను కొత్త స్పీకర్ పక్కన పెట్టారు.
శివసేన లెజిస్లేటివ్ లీడర్ పదవి నుంచి కూడా తొలగించారు. ఏక్‌నాథ్ షిండే శివసేన పార్టీ కొత్త విప్‌ను నియమించడంపై మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే భగ్గుమంటున్నారు. విప్ నియామకంపైనా, స్పీకర్ ఎన్నికపైనా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మధ్యాహ్నం శివసేన పార్టీ జిల్లాల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేశారు ఉద్ధవ్ థాక్రే. ముంబైలోని శివసేన భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఏక్‌నాథ్ షిండే నెక్ట్స్ టార్గెట్.. శివసేన పార్టీ జెండా, గుర్తు. శివసేనను పూర్తిగా చేజిక్కించుకోడానికి షిండే పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్మేల మద్దతు సాధించారు. ఇక ఎంపీలు కూడా షిండే వెంట రావాల్సింది ఉంది. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ యంత్రాంగం కూడా షిండేకే జై కొట్టాల్సి ఉంటుంది. అప్పుడే శివసేన పార్టీని చేజిక్కించుకునేందుకు వీలవుతుంది. లేదంటే కోర్టులో ఎదురుదెబ్బలు తప్పవు. ఈ పరిణామాలను ఊహించిన ఉద్ధవ్ థాక్రే.. ఈ మధ్యాహ్నం తరువాత శివసేన పార్టీ జిల్లాల అధ్యక్షులతో మీటింగ్ ఏర్పాటు చేశారు.