Election Commission : ఓటు వేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదు ..ఈసీ క్లారిటీ

Update: 2024-02-28 06:45 GMT

రాబోయే ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని, అది లేకపోయినా ఓటు వేయవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పేర్కొంది. ఆధార్ కార్డులేని వారిని ఓటు వేయకుండా అడ్డుకోబోమని తృణమూల్ కాంగ్రెస్ బృందానికి స్పష్టంచేసింది. ఓటరు కార్డును గానీ, చెల్లుబాటయ్యే ఇతర గుర్తింపు పత్రాల్లో దేనినైనా గానీ చూపించి ఓటు వేయవచ్చని వివరించింది. పశ్చిమ బెంగాల్లో వేలసంఖ్యలో ఆధార్ కార్డులను క్రియారహితం చేస్తున్నారని తృణమూల్ ఎంపీలు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.

ఆర్థికం గా సున్నితమైన ప్రాంతాలపై నిఘా కోసం జిల్లాస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని వారు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులు దీనిలో ఉండేలా చూడాలన్నారు. దీనిపై ఈసీ నిర్ణయం తీసుకుంద ని, బెంగాల్లో ఇలాంటివి ఏర్పాటుకావడం ఇదే తొలిసారి అని తృణమూల్ నేతలు విలేకరులకు తెలిపారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసేలా కేంద్ర బలగాలు వ్య వహరించాయని, ఈసారి అలాంటివి జరగకుండా చూడాలని పార్టీ తరఫున సీఈసీని కోరినట్లు చెప్పారు.

లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు విని యోగంపై విస్తృత అవగాహన కల్పించి పోలింగ్ శాతాన్ని పెంచడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రయ త్నిస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసు శాఖల్లో అవగా హన కార్యక్రమాలు నిర్వహించే చర్యలు చేపట్టింది. భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ), తపాలా శాఖలతో సోమవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.

Tags:    

Similar News