వేసవి సెలవుల వేళ దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. 6 వేసవి రైళ్లను మరికొన్ని రోజులు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కాచిగూడ-తిరుపతి ట్రైన్(07653)ను మే 1 వరకు, తిరుపతి-కాచిగూడ(07654) మే 2 వరకు, సికింద్రాబాద్-రామగుండం(07695) ఏప్రిల్ 24 వరకు పొడిగించింది. రామగుండం-SECBAD(07696) ఏప్రిల్ 26 వరకు SECBAD-నర్సాపూర్ (07170) ఏప్రిల్ 27 వరకు, నర్సాపూర్-SECBAD (07169) ఏప్రిల్ 28 వరకు పొడిగించింది.
మరోవైపు గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో జరిమానాల రూపంలో రూ.300 కోట్లను వసూలు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. టికెట్ లేని ప్రయాణం, ముందస్తుగా బుక్ చేయకుండా లగేజ్ తరలించడం, తదితర కారణాలతో మొత్తం 46.26 లక్షల కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. ముంబయి డివిజన్ పరిధిలో 20.56 లక్షల కేసులకు గాను రూ.115.29కోట్లు వసూలు చేసి తొలిస్థానంలో నిలిచింది. భుసావల్ డివిజన్‌లో 8.34లక్షల కేసులకు గాను రూ.66.33 కోట్లు వసూలయ్యాయి.