రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా-మనోహర్‌పూర్ రహదారిపై ఒక పికప్ వాహనం కంటైనర్ ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. మృతులలో ఏడుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరంతా ఖాటూ శ్యామ్ దేవాలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతులంతా ఖాటూ శ్యామ్ దేవాలయాన్ని సందర్శించి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.