Arvind Kejriwal : కేజ్రీవాల్‌ విడుదలపై పాక్ మాజీ మంత్రి హ్యాపీ

Update: 2024-05-11 08:08 GMT

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదల వార్త పాకిస్థాన్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ‘మోడీ ప్రత్యర్థి కేజ్రీవాల్‌ను భారతదేశ అత్యున్నత న్యాయస్థానం విడుదల చేసింది.’ అంటూ డాన్ పత్రిక హెడ్ లైన్స్ లో పేర్కొంది. ఇది మోడీ ప్రభుత్వ ఓటమి అంటూ పాక్ నేతలు కూడా సంబరాలు చేసుకున్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విడుదల వార్తను షేర్ చేస్తూ.. మితవాద భారతదేశానికి ఇది శుభవార్త అని పాకిస్థాన్ మాజీ కేంద్ర మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ అన్నారు. చౌదరి ఫవాద్ హుస్సేన్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీపై, భారత్‌పై విషపూరిత ప్రకటనలు చేశారు. మే నెల ఆరంభంలోనూ చౌదరి ఫవాద్ హుస్సేన్ ఇలాంటి వ్యాఖ్యలేచేశారు. కాంగ్రెస్ ప్రిన్స్ రాహుల్ గాంధీని ఉద్దేశించి.. భారత ఎన్నికలలో నరేంద్ర మోడీని ఆపాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇది భారత్ లో బీజేపీ రాజకీయ అస్త్రంగా వాడుకుంటోంది.

ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై పాకిస్థాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ పొగడ్తలు కురిపించారు. రాహుల్ మంచి దూకుడు చూపిస్తున్నారని అన్నారు. దీంతో.. దేశంలో కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్థాన్ సంబరాలు చేసుకుంటుందని అంటూ బీజేపీ నేతలు ప్రచారంలో హోరెత్తిస్తున్నారు.

Tags:    

Similar News