Haryana BJP : సంక్షోభంలో హర్యానా బీజేపీ సర్కారు

Update: 2024-05-09 10:08 GMT

హర్యానా రాష్ట్రంలో పొలిటికల్ నంబర్లు మారాయి. బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మైనారిటీలో పడింది.

ఈ ప్రభుత్వానికి ప్రస్తుతం ఇద్దరు ఇండిపెండెంట్ల సపోర్ట్ మాత్రమే ఉంది. హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. వాటిలో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలతో రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. మిగిలిన 88 సీట్లలో బీజేపీకి 40, కాంగ్రెస్ కు 30, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజారిటీకి 45 మంది ఎమ్మెల్యేల మద్ధతు అవసరం.

ప్రభుత్వ ఏర్పాటు సమయంలో బీజేపీకి మద్ధతు ఇచ్చిన జేజేపీ.. ఆ తరువాత మద్దతు ఉపసంహరించుకుంది. ఇండిపెండెంట్ల మద్దతుతో నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. ఇప్పుడు తాజాగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. రైతులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సహా వివిధ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిపెండెంట్లు తెలిపారు. ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారరు. హర్యానాలో అక్టోబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News