అసోం రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ప్రమాద హెచ్చరిక దాటి మరీ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీవర్షాలు కురుస్తుండటంతో బ్రహ్మపుత్ర నదిలోకి భారీగా వరదనీరు చేరుతోంది.
బ్రహ్మపుత్ర నది నీటిమట్టం 105.79 మీటర్లు దాటడంతో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. పలుచోట్ల ఇండ్లు నీట మునిగాయి. జనం అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరించారు.