Hemant Soren : బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్..

Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బ‌ల‌ప‌రీక్షలో నెగ్గారు. ఇవాళ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకున్నారు;

Update: 2022-09-05 13:00 GMT

Hemant Soren : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ బ‌ల‌ప‌రీక్షలో నెగ్గారు. ఇవాళ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకున్నారు. సోరెన్‌కు అనుకూలంగా 48 మంది ఓటేశారు. బ‌ల‌ప‌రీక్ష స‌మ‌యంలో ప్రతిప‌క్ష బీజేపీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. స్వయంగా గనులను కేటాయించుకున్న అంశంపై హేమంత్‌ సోరెన్‌పై ఈసీ అనర్హత వేటుకు గవర్నర్‌కు సిఫార్సు చేసింది. అప్పటినుంచి జార్ఖండ్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. దీనికి తెరదించేందుకు సోరెన్‌ బలపరీక్షకు వెళ్లారు.

బలపరీక్ష నెగ్గిన అనంతరం అసెంబ్లీలో సోరెన్‌ మాట్లాడుతూ.. బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేల్లో చిచ్చుపెట్టి ప్రభుత్వాన్ని కూల్చాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు. దేశంలో ప్రచ్ఛన్న యుద్ధ వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేస్తున్నార‌ని అన్నారు. ఎన్నిక‌ల్లో నెగ్గేందుకు అల్లర్లు సృష్టిస్తున్నట్లు ఆయ‌న ఆరోపించారు. 

Tags:    

Similar News