Maharashtra : మహారాష్ట్రలోనూ హిందీ భాషా వివాదం

Update: 2025-04-18 10:00 GMT

హిందీ భాషా వివాదం తమిళనాడు నుంచి మహారాష్ట్రకు చేరింది. మూడో భాషగా హిందీని స్కూళ్లలో అమలు చేయాలని మహారాష్ట్రలోని ఫడ్నవిస్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్ఎస్ఈపీ) అమలులో భాగంగా మరాఠీ, ఇంగ్లిష్ మీడియం ప్రాథమిక పాఠశాలల్లో హిందీని తప్పనిస రిగా మూడో భాషగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వంతో మెరుగైన సంభాషణను సులభతరం చేస్తుందని ఉత్తర్వుల్లో తెలిపింది.

మరాఠీ ఇప్పటికే తప్పనిసరి భాషగా బోధిస్తున్నమని, ఇప్పుడు మనమందరం దేశ భాషను కూడా ఇది కొత్త నోటిఫికేషన్ కాదు, ఇది విద్యా విధానంలో ఉన్నదే అని ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. 'మేం హిందువులం. కానీ హిందీ కాదని పేర్కొంటూ.. మహారాష్ట్రకు హిందీ రంగు వేయడానికి ప్రయత్నిస్తే రాష్ట్రంలో పోరాటం ఖాయమని హెచ్చరించారు. 'మీ త్రిభాషా ఫార్ములా ను ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితం చేయండి. విద్యలోకి తీసుకురావద్దు. మహారాష్ట్రపై మరొక ప్రాంతం భాషను ఎందుకు రుద్దుతున్నారు? దీనితో భాషా ప్రాంతీయీకరణ సూత్రం దెబ్బతింటుంది' అని ఎక్స్ పోస్ట్లో రాజ్ ఠాక్రే పేర్కొన్నారు.

Tags:    

Similar News