ఆపరేషన్ సిందూర్ వివరాలను బయట పెట్టడంపై రాహుల్ గాంధీ మరోమారు ఫైర్ అయ్యారు. విదేశాంగ మంత్రి జైశంకర్ టార్గెట్ గా విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా మరోమారు ప్రశ్నలు సంధించారు. ఆపరేషన్ సిందూర్ కు సం బంధించిన మనం ముందే సమాచారం ఇచ్చినం దున ఎన్ని విమానాలు కోల్పోయామో బయటపై ట్టాలని డిమాండ్ చేశారు. మందస్తు సమాచారం ఇవ్వడం కేవలం తప్పిదం కాదని, ఒక నేరమని రాహల్ రాసుకొచ్చారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకరు లక్ష్యంగా చేసుకొని మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి "మన దాడి ప్రారంభంలోనే పాకిస్తాన్ కు సమాచారం ఇవ్వడం నేరం" అని జైశంకర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత వైమానిక దళం ఈ ఆప రేషన్లో ఎన్ని విమానాలు కోల్పోయిందనే గత ప్ర శ్నను గుర్తు చేస్తూ.. "మరోసారి అడుగుతున్నాను" పాకిస్తాన్కు ముందే సమాచారం తెలిసినందున మనం ఎన్ని విమానాలు కోల్పోయాము?" అని జై శంకర్ని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం చేసిన పోస్ట్ కు కొనసాగింపుగా మరో ట్వీట్ చేయడం గమనార్హం.