Elections Time : ఎన్నికల టైంలో మీ ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చో తెలుసా..

Update: 2024-05-04 07:03 GMT

దేశమంతటా ఎన్నికల రెయిడ్స్ జరుగుతున్నాయి. కోట్లలో డబ్బు పట్టుబడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇంట్లో లీగల్ గా ఎంత డబ్బు ఉంచుకోవచ్చు అనేది ఓసారి తెలుసుకుందాం. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. ఇంట్లో ఎంత డబ్బు ఉంచుకున్నప్పటికీ.. అన్నింటికీ లెక్కలు ఉండాలి. ప్రూఫ్స్ ఉండాలి. దర్యాప్తు సంస్థ మిమ్మల్ని ఎప్పుడైనా విచారిస్తే, మీరు రుజువు చూపవలసి ఉంటుంది. అంతేకాకుండా ఐటీఆర్ డిక్లరేషన్ కూడా చూపించాలి.

న్యాయంగా సంపాదించిన డబ్బు ఎంత ఉన్నా దానికి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. లెక్కలు చూపని డబ్బు ఉంటే మాత్రం దానికి 137% వరకు పన్ను విధిస్తారు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194N ప్రకారం, ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే TDS చెల్లించాలి. ఐటీఆర్ ఫైల్ చేసేవారు ఈ విషయంలో కొంత ఉపశమనం పొందుతారు. అటువంటి వ్యక్తులు TDS చెల్లించకుండానే బ్యాంకు, పోస్టాఫీసు లేదా సహకార బ్యాంకు ఖాతా నుండి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1 కోటి వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.

Tags:    

Similar News