SpiceJet Flights : హైదరాబాద్-అయోధ్య స్పైస్‌జెట్ విమాన సేవలు రద్దు

Update: 2024-06-13 06:50 GMT

హైదరాబాద్ నుంచి అయోధ్యకు గతంలో ప్రారంభించిన విమాన సేవలను రద్దు చేసినట్లు స్పైస్‌జెట్ ( SpiceJet ) సంస్థ వెల్లడించింది. తగిన డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. జూన్ 1 నుంచే ఈ సేవలు నిలిపివేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే చెన్నై- అయోధ్య విమాన సేవలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కాగా ఏప్రిల్‌లో వారానికి మూడు రోజుల చొప్పున HYD నుంచి అయోధ్యకు స్పైస్‌జెట్ నాన్ స్టాప్ ఫ్లైట్ సేవలను ప్రారంభించింది.

హైదరాబాద్ - అయోధ్య మధ్య సర్వీసు కోసం స్పైస్‌జెట్ సంస్థ.. ఎయిర్‌లైన్ ఎయిర్‌బస్ ఏ320ని ఉపయోగించింది. ఈ విమానం వారానికి మూడుసార్లు నడిచింది. ఈ విమానం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 10:45 గంటలకు బయలుదేరి.. మధ్యాహ్నం 12:45 గంటలకు అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ విమానం మధ్యాహ్నం 1:25 గంటలకు అయోధ్య నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 3:25 గంటలకు హైదరాబాద్‌లో చేరుకుంటుంది.

Tags:    

Similar News