మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులు, మాజీ ముఖ్యమంత్రులు ఉద్ధవ్ ఠాక్రే ( Uddhav Thackeray ), దేవేంద్ర ఫడ్నవీస్ ( Devendra Fadnavis ) ఎదురుపడ్డారు. లిఫ్ట్ కోసం వీరిద్దరూ కలిసి ఎదురుచూస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
సమయంలో వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకోవడంతో పాటు కొంతసేపు మాట్లాడుకున్నారు. వారు ఏ విషయం గురించి చర్చించుకున్నారో తెలియదు. గానీ.. సీరియస్ చర్చేనంటూ ప్రచారం జోరందుకుంది. దీనిపై ఉద్ధవ్ ఠాక్రేను మీడియా ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాము రహస్య సమావేశాలన్నీ లిస్ట్ లోనే పెట్టుకుంటామంటూ సరదాగా అన్నారు.
దేవేంద్ర జీ, నేను ఒకే లిఫ్ట్ లో వెళ్లినప్పుడు.. బహుశా చాలా మంది అనేక రకాలుగా అభిప్రాయ పడి ఉంటారు. కానీ అలాంటిదేమీ లేదు. మేం అనుకోకుండా కలిశామంతే..! అని ఉద్ధవ్ థాకరే తెలిపారు.