రాజస్థాన్ లోని ఓ పోలింగ్ బూత్ లో ఎన్ని కల సిబ్బందిపై ఇండిపెండెంట్ అభ్యర్థి చేయిచేసు కున్నాడు. డియోలి యునియారా నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి నరేష్ మీనా.. సంరవత పోలింగ్ బూత్ వద్ద సబ్ డివిజనల్ మేజి స్టేట్ ని చెంపదెబ్బ కొట్టడం తీవ్ర కలకలం రేపింది. అందుకు సంబంధించిన వీడియోలో వైరల్ గా మారింది. అభ్యర్థి మీనా పోలింగ్ బూత్లోకి వెళ్లి, ఎన్నికల ప్రోటోకాలు పర్యవేక్షించడానికి డ్యూటీలో ఉన్న సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అమిత్ చౌదరిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై మీనాను అడ్డుకున్నారు. నరేష్ మీనా కాంగ్రెస్ మాజీ నాయకుడు. డియోలీయునియారా ఉపఎన్నికలో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. భారత్ ఆదివాసీ పార్టీ మద్దతు తో నరేష్ మీనా ఇండిపెండెంట్గా నిలబడ్డారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ.. "ఇక్కడ అధికారిగా నియమించబడిన ఎస్జీఎం ముగ్గురు అధికారులతో క్రాస్ ఓటింగ్ జరిపిస్తున్నాడు" అని అన్నారు. 'ఈ ఘటనతో పోలీసులు భారీగా మొహ రించారు. ప్రజలు తమ ఓటు హక్కుతో అవినీతిప రులకు బుద్ధి చెప్పండి' అని పిలుపునిచ్చారు.