నీట్ పరీక్ష వివాదాస్పద అంశంపై పార్లమెంట్ లో చర్చ జరపాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఒక వేళ చర్చకు అనుమతి ఇవ్వకపోతే, సభలో నిరసనలు తెలిపేందుకు నిర్ణయించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఇంట్లో గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగే చర్చల్లో కూడా పాల్గొనాలని ఇండియా కూటమి నేతలు నిర్ణయిం చారు. ప్రతిపక్షాలంతా ఐక్యంగా ఉన్నాయని సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్రీయ లోక్ తంత్రిక్ పార్టీ అధ్యక్షుడు హనుమాన్ బెనివాల్ తెలిపారు. పార్లమెంట్ లో నీట్, అగ్నివీర్, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అంశాలపై చర్చలకు డిమాండ్ చేయనున్నామని చెప్పారు.