CHINA: 'మిషన్ దివ్యాస్త్ర' పై డ్రాగన్ నిఘా
ఈ క్షిపణిలోని టెక్నాలజీ ప్రత్యేకత ఏంటంటే;
భారత్ ‘మిషన్ దివ్యాస్త్ర’పరీక్షను చైనా దొంగచాటుగా పరిశీలించిందని తెలుస్తోంది. ఒక క్షిపణితో అనేక లక్ష్యాలను ఒకేసారి ఛేదించే ఎంఐఆర్‌వీ సాంకేతికతతో తొలిసారి అగ్ని-5 క్షిపణిని పరీక్షించింది. ఇందుకు కొన్ని వారాల ముందేబీజింగ్ నుంచి బంగాళాఖాతం దిశగా..చైనా పరిశోధకనౌక బయల్దేరింది.అప్పటికే మరో నిఘా ఓడ భారత్‌కు సమీపంలోని మాల్దీవుల్లో తిష్ఠ వేసింది.
అగ్ని-5 సామర్థ్యం 5 వేల కిలోమీటర్ల కంటే బాగా ఎక్కువని చైనా భావిస్తోంది. అగ్ని5 క్షిపణి పరిధి దాదాపు 8,000 కిలో మీటర్ల వరకు ఉంటుందని, 2012లో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అకాడమీ ఆఫ్ మిలటరీ సైన్సెస్ నిపుణుడు.. డువెన్లాంగ్ ఒక పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో చైనా పరిశోధన పేరిట తమ నౌకలను పంపి అగ్ని-5 పరీక్షను ఆసాంతం పరిశీలించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 23న క్వాంగ్‌డావ్ నుంచి ‘షియాంగ్ యంగ్ హాంగ్ 01’ నౌక బయల్దేరిందని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ వెల్లడించారు. మెరైన్ ట్రాఫిక్ విశ్లేషణ కూడా దానిని ధ్రువీకరించింది. 4,425 టన్నుల బరువున్న ఈ ఓడ భారత్ క్షిపణిని పరీక్షించిన సమయంలో.. ఆదివారం బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. భారత్ అణుజలాంతర్గాముల స్థావరమైన విశాఖ తీరం నుంచి 480 కిలోమీటర్ల దూరంలో అది ఉందని సమాచారం. క్షిపణి పరీక్షలకు ముందు హెచ్చరిక సూచీ అయిన ‘నోటిస్ టు ఎయిర్‌మిషన్-’నోటామ్‌ను భారత్ మార్చి 7న జారీ చేసింది. దీంతో బంగాళాఖాతంలో3వేల550 కిలోమీటర్ల పరిధిలో నౌకలు, విమానాల కార్యకలాపాలను నియంత్రించింది.
ఆ తేదీల్లోనే డ్రాగన్‌కు చెందిన‘షియాంగ్ యంగ్ హాంగ్ 01’ బంగాళాఖాతంలోకి వచ్చింది. దీనిలో అగ్ని-5 పరీక్షను పూర్తిగా గమనించి దాని పరిధి, సామర్థ్యాన్ని అంచనావేసుకొనే టెక్నాలజీ ఉందనే అంచనాలున్నాయి. కానీ, చైనా మాత్రం ఇది కేవలం పరిశోధక నౌకే అని బుకాయిస్తోంది. భారత్ అగ్నిశ్రేణి క్షిపణి పరీక్ష తలపెట్టినప్పుడల్లా చైనానౌకలు హిందూ మహాసముద్రంలోకి రావడం పరిపాటిగా మారింది. 2022 నవంబర్‌లోనూ ఆ దేశానికి చెందిన యువాన్ వాంగ్ శ్రేణి నౌక.. హిందూ మహాసముద్రంలోకి వచ్చింది. వాస్తవానికి భారత్ అదే సమయంలో అబ్దుల్ కలాం ద్వీపం నుంచి అగ్ని-5 పరీక్షకు సర్వం సిద్ధం చేసింది. చైనా నిఘా నౌకను గమనించి అప్పుడు నోటీస్ నోటిస్ టు ఎయిర్‌మిషన్‌ను రద్దు చేశారు. డిసెంబర్‌లో మరోసారి పరీక్షకు ఏర్పాట్లు చేయగా చైనా నౌక ఆ ప్రాంతంలో మళ్లీ ప్రత్యక్షమైంది. అమెరికాకు చెందిన థింక్‌ట్యాంక్ సీఎస్‌ఎస్ నివేదిక ప్రకారం చైనా వద్ద64 వరకు పరిశోధక, సర్వే నౌకలున్నాయి. వీటిల్లో 80శాతం కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆ సంస్థ వెల్లడించింది.